ఇటు లక్నో విన్నింగ్ టీమ్‌గా బరిలోకి దిగనుంది. లక్నో తమ హోమ్ గ్రౌండ్‌లో ఫ్లాట్ సర్ఫేస్‌లో ఫాస్ట్ బౌలర్లతో ఢీల్లి టీమ్‌ని ఒక ఆట ఆడుకుంది. కానీ చెన్నై పిచ్ స్లో, స్టిక్కీగా ఉండడమే కాకుండా రెండు టీమ్స్‌లో టాప్ ఆర్డర్‌లో ఇద్దరేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఉండడంతో హాఫ్ స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. దీంతో లక్నో ఎలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. చెన్నై పిచ్ స్పిన్నింగ్ ట్రాక్ కావడంతో.. స్పెషలిస్ట్ స్పిన్నర్లు టీమ్‌లో ఉండటం ఇంపార్టెంట్.
రెండు టీమ్స్‌లో చూసుకుంటే చెన్నైలో ఇద్దరు వరల్డ్ క్లాస్ లెగ్ స్పిన్నర్స్ జడెజా, సాంట్నర్ ఉండగా.. లక్నో టీమ్‌లో రవి బిష్ణోయ్ మాత్రం తన గూగ్లీలతో ఆపోజిషన్‌కి చెమట పట్టించడానికి రెడీగా ఉన్నాడు. కానీ.. చెన్నై హోమ్ గ్రౌండ్‌లో చెన్నైకి మంచి రికార్డ్ ఉంది. ఈ టీమ్‌ని ఢిఫీట్ చేయడం అంత ఈజీ కాదు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే లాస్ట్ ఇయర్‌లో ఒకే మ్యాచ్ ఆడిన ఈ రెండు టీమ్స్ భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై ఫిక్స్ చేసిన 210 రన్స్ టార్గెట్‌ని కేవలం 19.3 ఓవర్లలోనే ఫినిష్ చేసి లక్నో విన్ అయింది. కానీ ఆ మ్యాచ్ రెండు టీమ్స్ హోమ్ గ్రౌండ్స్‌లో కాకుండ ముంబై వాంఖడే స్టేడియంలో జరిగింది.
వాంఖడే స్టేడియం రెండు టీమ్స్‌కి న్యూట్రల్ వెన్యూ. ఈ మ్యాచ్‌లో చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్ ఉండడమే కాకుండా.. ఇది చెన్నైకి కంచుకోట లాంటిది. కానీ చెన్నై టీమ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్స్‌కి మాత్రం ఇది ఫస్ట్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్. స్పెషల్లీ ఇది 2022 ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్‌కి ఫస్ట్ హోమ్ మ్యాచ్. ప్రస్తుతం రెడ్‌హట్ ఫామ్‌లో ఉన్న గైక్వాడ్ పైనే అందరి చూపు. లాస్ట్ మ్యాచ్‌లో 92 రన్స్ చేసిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్‌గా చెన్నైలో ప్రశాంత్ సోలంకీ, లక్నో టీమ్‌లో క్రిష్ణప్ప గౌతమ్ ఉండే అవకాశం ఉంది. ఈ స్లో ట్రాక్‌లో ఎవరు విన్ అవుతారో చూడాలి