2004లో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్‌తో కెరీర్ ప్రారంభించిన దినేష్.. తక్కువ టైంలోనే మంచి ప్లేయర్ అనిపించుకున్నాడు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలోనే తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నిఖితతో లవ్‌లో పడ్డాడు. దినేష్, నిఖిత ఫాదర్స్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. నిఖిత డిగ్రీ పూర్తి చేసింది. దినేష్ కూడా అప్పటికే ఇంటర్నేషనల్ టీంలో ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో వాళ్లు పెళ్లి చేసుకుంటాం అనగానే వెంటనే పెళ్లి చేశారు వాళ్ల పేరెంట్స్. దినేష్‌తో కలిసి ప్రతీ మ్యాచ్‌కు వెళ్లేది నిఖిత. అలా దినేష్ ఫ్రెండ్, టీమిండియా ప్లేయర్ మురళి విజయ్‌తో నిఖితకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది.
కొన్ని రోజులకే వాళ్లిద్దరి మధ్య ఎఫైర్ మొదలైంది. కానీ అప్పటికే నిఖితను బాగా నమ్మిన దినేష్ వాళ్ల స్నేహాన్ని తప్పుగా చూడలేదు. కానీ చాలా మందికి వీళ్ల విషయం తెలిసిపోయింది. ఓ సారి మ్యాచ్ కంప్లీట్ అయిన తరువాత నిఖిత, మురళి కాస్త క్లోజ్‌గా ఉన్న టైంలో దినేష్ వాళ్లను చూశాడు. వాళ్లిద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని దినేష్ జూనియర్ అతనికి చెప్పాడు. వెంటనే నిఖితను నిలదీశాడు దినేష్. ఏమాత్రం రిగ్రెట్ లేకుండా ఉన్న విషయం తెప్పింది నిఖిత. తాను మురళిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
కానీ అప్పటికే ఆమె 7 నెలల ప్రెగ్నెంట్. దీంతో ఒక్కమాట కూడా అనకుండా మురళిని పెళ్లి చేసుకోమని చెప్పి నిఖితను పంపించేశాడు దినేష్. ఆ డిప్రెషన్లోనే కెరీర్లో వెనకబడిపోయాడు. చాలా రోజులకు క్రికెట్ కోచ్ కిరణ్ మోరే శిక్షణలో మళ్లీ కెరీర్ లో ముందుకు సాగాడు. మ్యాచ్‌లకు వెళ్లిన సమయంలో తన మాజీ భార్య మురళితో కలిసి అక్కడికి వచ్చేది. కానీ ఆ బాధను కూడా బలంగా మార్చుకున్నాడు దినేష్. డే బై బే తన గేమ్‌ను మరింత మెరుగ్గా చేసుకుంటూ ఐపీఎల్లో ఏకంగా కోల్‌కతా కెప్టెన్‌గా ఎదిగాడు.
అప్పుడే దినేష్ లైఫ్‌లోకి వచ్చింది స్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్. దినేష్‌కు, దీపికకు ఒకే వ్యక్తి ఫిట్నెస్ కోచ్‌గా ఉండేవాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇంగ్లండ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దీపిక కూడా అక్కడికి ఓ ప్రాజెక్ట్ పని మీద వెళ్లింది. టోర్నమెంట్ మధ్యలో టైం దొరికిన ప్రతీసారి దీపికను కలిసివచ్చేవాడు దినేష్. ఆమెతో స్వాష్ గేమ్ ఆడటమంటే దినేష్‌కు చాలా ఇష్టం. ఇలా దినేష్ గురించి బాగా తెలుసుకున్న దీపిక.. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. కొన్ని రోజులకు వాళ్లిద్దరూ హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు.
వాళ్లికిప్పుడు ట్విన్ బేబీ బాయ్స్. కొన్నాళ్లకు ఫిట్నెస్ కారణంగా షార్ట్ ఫార్మాట్‌కు దూరమయ్యాడు దినేష్. కానీ ఇప్పుడు మళ్లీ తనను తాను స్ట్రాంగ్‌గా చేసుకుంటూ ఐపీఎల్‌కు రెడీ అయ్యాడు. ఎవరి వల్ల తాను ఎమోషనల్‌గా డ్యామేజ్ అయ్యాడో.. ఇప్పుడు వాళ్ల ముందే కింగ్‌లా భార్యతో మ్యాచెస్‌కు వెళ్తున్నాడు దినేష్. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తాను ఏం కోల్పోయిందో మాజీ భార్యకు తెలిసేలా చేశాడు.