Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో మొనగాడు..!

ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా క్రిస్టియానో ​​రొనాల్డో నిలిచాడు. 2017లో సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత గత జులైలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్‌గా రొనాల్డో నిలిచాడు. తాజాగా 2023 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

  • Written By:
  • Updated On - August 11, 2023 / 12:59 PM IST

Cristiano Ronaldo: ఆటలోనే కాదు.. ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. 2017లో సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత గత జులైలో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్‌గా రొనాల్డో నిలిచాడు. తాజాగా 2023 ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూలింగ్ టూల్.. ‘హాప్పర్ హెచ్‌క్యూ’ సంస్థ.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఆదాయాలను రికార్డ్ చేస్తుంది.

హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం.. ఈ పోర్చుగల్ ఆటగాడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో 600 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు 3.23 మిలియన్ డాలర్లు చార్జ్ చేస్తున్నాడు. ఆయన తరువాత స్థానంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు. అతడు 2.6 మిలియన్ డాలర్లు సంపాదిస్తూ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కొందరు ఫుట్ బాల్ ప్లేయర్లు, పాప్ సింగర్లు కూడా చోటు సంపాదించారు. ఇన్‌స్టా విషయంలో భారత్ నుంచి అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ ఒక్కో పోస్టుకు దాదాపు రూ.8 కోట్లు ఆర్జిస్తున్నట్లు సదరు రీసెర్చ్ కంపెనీ పేర్కొంది.