CSK vs GT: రషీద్ ఖాన్‌కే చుక్కలు.. భారీ సిక్సర్లతో అదరగొట్టిన రిజ్వి

సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికి శివమ్‌ దూబే ఔటయ్యాడు. అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా యువ ఆటగాడు రిజ్వీకి సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ప్రమోషన్‌ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 01:42 PM IST

CSK vs GT: చెన్నై సూప‌ర్ కింగ్స్ యువ ఆట‌గాడు స‌మీర్ రిజ్వీ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు సమీర్‌ రిజ్వీ. ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికి శివమ్‌ దూబే ఔటయ్యాడు.

AP Janasena Tickets: కృష్ణా జిల్లాలో జనసేన మీనమేషాలు… అభ్యర్థుల్ని ప్రకటించేదెవరు ?

అయితే రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా యువ ఆటగాడు రిజ్వీకి సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ ప్రమోషన్‌ ఇచ్చింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. తన ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. స్వ్కెర్‌ లెగ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. దీంతో రషీద్‌ ఖాన్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన..మళ్లీ ఆఖరి బంతికి లాంగాఫ్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిజ్వీ ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వీ.. 2 సిక్స్‌ల సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో రిజ్వీ దుమ్మురేపాడు.