David Warner: రిటైర్మెంట్.. అంతలోనే కెప్టెన్సీ.. వార్నర్‌కు సారథ్య బాధ్యతలు

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ ట్వంటీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుబంధ జట్టు.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 06:22 PM IST

David Warner: అంతర్జాతీయ టెస్ట్, వన్డేలకు గుడ్ బై చెప్పిన 24 గంటల్లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయి. జాతీయ జట్టులో కాదండోయ్.. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ ట్వంటీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుబంధ జట్టు.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. కెప్టెన్‌ మార్వెల్‌ అంటూ వార్నర్‌ ఆగమాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ విడుదల చేసింది.

HARDHIK PANDYA: పాండ్యా స్థానంలో ముంబై కెప్టెన్‌ అతనేనా..? ఆల్‌రౌండర్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత

దుబాయ్‌ క్యాపిటల్స్‌కు తొలి ఎడిషన్‌లో వెస్టిండీస్‌ స్టార్‌ రోవ్‌మన్‌ పావెల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పది మ్యాచ్‌లలో నాలుగు గెలిపించి ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. కాగా రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్‌ 16వ సీజన్‌లో వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా వ్యవహరించాడు. గతేడాది 14 మ్యాచ్‌లలో కలిపి 516 పరుగులు సాధించిన వార్నర్‌.. కెప్టెన్‌గా దారుణంగా విఫలమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ కేవలం ఐదు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ వార్నర్‌‌పై నమ్మకం ఉంచిన క్యాపిటల్స్‌ మేనేజ్‌మెంట్‌ రోవ్‌మన్‌ పావెల్‌ స్థానంలో పగ్గాలు అప్పగించింది. ప్రస్తుత సీజన్‌ కోసం 37 ఏళ్ల వార్నర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.

కాగా జనవరి 13 నుంచి ఐఎల్‌టీ20 రెండో ఎడిషన్‌ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను విజేతగా నిలిపిన వార్నర్‌కు టీ20లలో బ్యాటర్‌గానూ మంచి రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు మొత్తంగా 356 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యండర్ 11 వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి.