Team India : సఫారీల చేతిలో ఓటమి.. టాప్ ప్లేస్ కోల్పోయిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఊహించినట్టుగానే ఫేస్ పిచ్ పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత్ ఘోర పరాభవం చవిచూసింది. ఊహించినట్టుగానే ఫేస్ పిచ్ పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఈ ఓటమితో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన భారత్‌.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమిండియా తొలిస్దానంలో ఉండేది. ఈ ఓటమితో ఇప్పుడు భారత్‌ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది.

ఇక ఈ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్. చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్తాన్ , న్యూజిలాండ్ జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్ధానంలో ఉంది. కాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్‌ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్‌ ఉంది. మరోవైపు కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే.. తమ స్ధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే స్వింగ్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. పిచ్ నుంచి వచ్చిన సపోర్ట్ తో సఫారీ బౌలర్లు భారత బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ వికెట్లు సాధించారు.