ఐపీఎల్ మెగా వేలం ఈ ముగ్గురికీ ఢిల్లీ గుడ్ బై

ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ ను కూడా వదులుకోక తప్పడం లేదు.

  • Written By:
  • Publish Date - September 4, 2024 / 08:05 PM IST

ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై క్లారిటీ తెచ్చుకున్న ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ ను కూడా వదులుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయబోయే జాబితాలో కీలక ఆటగాళ్ళు కూడా ఉన్నారు. ఓపెనర్ పృథ్వీషాకు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ బై చెప్పబోతోంది. గత మూడు సీజన్లలోనూ అతను నిరాశపరిచాడు. 2024 ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు ఆడి 198 పరుగులే చేశాడు. జాతీయ జట్టుకు కూడా దూరమైన పృథ్వీషాను ఢిల్లీ వేలంలోకి వదిలేయడం ఖాయమే. అలాగే రిటైర్మెంట్ కు చేరువైన పేసర్ ఇశాంత్ శర్మను కూడా వదిలేయనుంది. 2019 నుంచి ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇశాంత్ జాతీయ జట్టులో కూడా చాలాకాలం క్రితమే చోటు కోల్పోయాడు. ఐపీఎల్ లో యువ పేసర్లతో పోటీ పడుతున్న ఇశాంత్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. గత సీజన్ లో 10 వికెట్లు పడగొట్టిన ఇశాంత్ ను ఈ సారి వేలంలో మరో ఫ్రాంచైజీ కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా మరో పేస్ బౌలర్ ముఖేశ్ కుమార్ ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయనుంది. గత రెండు సీజన్లలో నిలకడగా రాణించిన ముఖేశ్ 2024 ఎడిషన్ లో 17 వికెట్లు పడగొట్టాడు. 10 మ్యాచ్ లలో ఎకానమీ కూడా 10.36గానే ఉన్నప్పటకీ వేలంలోకి వదిలేసేందుకే నిర్ణయించుకుంది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్స్ లో పలుసార్లు అతను నిరాశపరచడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు స్థానాలను భర్తీ చేసేలా వేలంలో యువ ఆటగాళ్ళపై ఫోకస్ పెట్టాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది.