Devdutt Padikkal: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. పలు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయిన రజత్ పాటిదార్‌పై వేటు పడనుంది. అతని స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తారని సమాచారం.
Krunal Pandya: కృనాల్‌కు షాక్ ఇచ్చిన లక్నో.. కొత్త వైస్ కెప్టెన్‌గా విండీస్ క్రికెటర్
రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్‌కు నాలుగో నంబర్‌లో అవకాశం ఇచ్చినప్పటికీ అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు పాటిదార్ మూడు టెస్టు మ్యాచ్‌లలో, ఆరు ఇన్నింగ్స్‌లలో 32, 9, 5, 0, 17, 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడికి మరో ఛాన్స్ ఇవ్వడం కంటే దేవదత్ పడిక్కల్‌ను ఈ టెస్ట్‌లో ఆడించడం మంచిదని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పడిక్కల్ ఎంట్రీతో రజత్ పాటిదార్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఒకవేళ దేవదత్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే ఈ సిరీస్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఐదో క్రికెటర్‌గా నిలుస్తాడు.
ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లోకి సర్ఫరాజ్‌ఖాన్, ధ్రువ్ జురేల్, ఆకాష్ దీప్, రజత్ పాటిదార్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రజత్ పాటిదార్ మినహా మిగిలిన వారందరూ రాణించారు. సీనియర్లు లేకపోవడంతో యువ ఆటగాళ్ళకు తుది జట్టులో చోటు దక్కింది.