చెన్నై స్కెచ్ వర్కౌట్ అయినట్టే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ

ఐపీఎల్ మెగా వేలంపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. బీసీసీఐతో సమావేశం జరిగిన తర్వాత పలు విషయాల్లో క్లారిటీ లేకున్నా తమ తమ వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ల రిటెన్షన్ రూల్ విషయంలో బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 05:59 PM IST

ఐపీఎల్ మెగా వేలంపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. బీసీసీఐతో సమావేశం జరిగిన తర్వాత పలు విషయాల్లో క్లారిటీ లేకున్నా తమ తమ వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ల రిటెన్షన్ రూల్ విషయంలో బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పరిగణించాలని కోరింది. దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ రూల్ ఏంటనే దానిపై చర్చ మొదలైంది. జాతీయ జట్టుకు ఆడని వారిని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా పిలుస్తారు.. అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐదేళ్ళు పూర్తయిన వారు కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు.

ఇప్పుడు ధోనీని ఇదే రూల్ తో తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్ళు దాటిపోవడంతో ఆ పాత నిబంధన వర్తిస్తుందని సీఎస్కే మేనేజ్ మెంట్ బీసీసీఐకి గుర్తు చేసింది. ఒకవేళ బీసీసీఐ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే చెన్నైకి రెండు లాభాలు… ఒకటి రిటెన్షన్ జాబితాలో ధోనీ పేరు చేర్చాల్సిన పనిలేదు.. అలాగే ప్రస్తుతం 12 కోట్లు తీసుకుంటున్న ధోనీని 4 కోట్ల ధరకే సొంతం చేసుకునే అవకాశముంటుంది. ఎందుకంటే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ కు అంతకంటే ఎక్కువ మొత్తం పెట్టకూడదు. దీంతో ఎలాగైనా సరే బీసీసీఐని కన్విన్స్ చేసి ధోనీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా వేలంలోకి పంపించి తిరిగి దక్కించుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ చేసింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.