Dhoni  : ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌కు . మార్చి 22న తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌కు . మార్చి 22న తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే సీజన్ ఆరంభానికి ముందే ప్రత్యర్ధి జట్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) హడలెత్తిస్తున్నాడు. చెపాక్‌లో ప్రాక్టీస్‌ క్యాంప్‌లో బీజీబీజీగా ఉన్న ధోని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. తనదైన స్టైల్‌లో భారీ షాట్లతో ఎంఎస్‌ విరుచుకుపడుతున్నాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా ధోని భారీ సిక్స్‌లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తలైవా ఈజ్‌ బ్యాక్‌.. ఈ సీజన్‌లో ఇక బౌలర్లకు చుక్కలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.