డీకే ఆల్‌టైమ్ ఎలెవన్ ధోనీకి దక్కని చోటు

  • Written By:
  • Publish Date - August 16, 2024 / 07:41 PM IST

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ భారత ఆల్ టైమ్ బెస్ట్ ఎలెవన్ ను ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధోనీ మూడు ఫార్మాట్లలో కలిపి 15000 ప్లస్ రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశాడు. ఈ తరం అత్యుత్తమ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్, జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు.దిగ్గజ ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ కూడా ఉన్నారు. తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కార్తీక్.. ఐదుగురు బ్యాటర్లతో పాటు ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లను తీసుకున్నాడు. మరో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లకు అవకాశం ఇచ్చాడు.