ఐపీఎల్ మెగా వేలం చెన్నై రిటెన్షన్ లిస్ట్ లో ధోనీ

ఐపీఎల్ మెగావేలానికి ముందు ప్రతీ ఫ్రాంచైజీ రిటైన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. నలుగురికి మించి రిటెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఫ్రాంచైజీలు తర్జన భర్జన పడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 22, 2024 / 02:36 PM IST

ఐపీఎల్ మెగావేలానికి ముందు ప్రతీ ఫ్రాంచైజీ రిటైన్ జాబితా ఎలా ఉంటుందన్న ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. నలుగురికి మించి రిటెన్షన్ చేసుకునే అవకాశం లేకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఫ్రాంచైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ జాబితాపై ఆసక్తి నెలకొంది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని రిటైన్ చేసుకుంటుంగా… అసలు ధోనీ ప్లేయర్ గా కొనసాగుతాడా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ధోనీని చెన్నై ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది. వీలైనంత తక్కువ ధరకే మహిని సొంతం చేసుకోవచ్చని సమాచారం. అన్ క్యాప్డ్ కేటగిరీలో దక్కించుకుంటుందా.. లేక మరో ఛాయిస్ ఏదైనా ఉందా అనేది బీసీసీఐ రిటైన్షన్ రూల్స్ ప్రకటిస్తే తప్ప తెలియదు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం చెన్నై రిటైన్ జాబితాలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, హిట్టర్ శివమ్ దూబే, పేసర్ మహేశ్ పతిరణ ఉన్నారు. వీరితో పాటు ధోనీని కూడా ఖచ్చితంగా జట్టుతో పాటే కొనసాగించాలని చెన్నై ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం. కాగా ధోనీ ఆటగాడిగా మరో సీజన్ లో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వికెట్ కీపర్ గా మాత్రమే అతను ప్రధానపాత్ర పోషించనుండగా… బ్యాటింగ్ లో మాత్రం చివరి 2 ఓవర్లలో అది కూడా అవసరమైతే తప్ప దిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత సీజన్ లో కూడా ధోనీ చివరి ఓవర్లలోనే బ్యాటింగ్ కు వచ్చాడు. వచ్చే సీజన్ లో ప్లేయర్ గా కొనసాగితే మాత్రం ఇదే పద్ధతిని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.