DHONI : ధోనీ బెంచ్ మార్చెయ్… లేదా స్కూల్ మూసెయ్

బరిలోకి దిగాడంటే ధనాధన్‌ రీసౌండు..! దమ్ము చూపి దుమ్ము రేగ్గొట్టే మొనగాడిగా పేరు..! అలాంటి పోటుగాడిని టీమ్‌లో పెట్టుకుని చెన్నై సరిగా ఉపయోగించుకోలేకపోతోందా?

బరిలోకి దిగాడంటే ధనాధన్‌ రీసౌండు..! దమ్ము చూపి దుమ్ము రేగ్గొట్టే మొనగాడిగా పేరు..! అలాంటి పోటుగాడిని టీమ్‌లో పెట్టుకుని చెన్నై సరిగా ఉపయోగించుకోలేకపోతోందా? విశాఖ మ్యాచ్‌లో కాస్త ముందుగా ధోనీ దిగితే రిజల్ట్‌ మరోలా ఉండేదా? అసలు ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఎందుకు దుమారం రేగుతోంది.

ధోనీ (Dhoni) మైదానంలో కనిపిస్తే ఫ్యాన్స్ కు పండుగే. అప్పటిదాకా మ్యాచ్ ఎలా ఉన్నా.. మహి వచ్చాడంటే బౌలర్లకు దడదడే. గతంలో సూపర్ సిక్స్ లతో ఎన్నో మ్యాచ్ లు గెలిపించాడు. అలాంటి ధోనీ ఈ సీజన్‌లో చెన్నై జట్టులో రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం దక్కలేదు. కానీ మూడో మ్యాచ్‌లో అదరగొట్టాడు. భారీ సిక్సర్లను అలవోకగా బాదుతూ తనదైన మార్క్ చూపించాడు. మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ… సింగిల్ హ్యాండ్ తో కొట్టిన సిక్స్ ఫ్యాన్స్ కు మెమరబులే… అచ్చొచ్చిన విశాఖలోధోనీ దుమ్మురేపాడు.

పాత ధోనీని తలపిస్తూ డీసీ బౌలర్లను (DC bowlers) వణికించాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ధోనీ బ్యాటింగ్ అభిమానుల్లో జోష్ నింపింది. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో ధోనీ కొట్టి సిక్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

వింటేజ్ ధోనీ… ఈ మ్యాచ్ లో కొంచెం ముందే వచ్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. చివరలో రావడం వల్ల టీమ్ నష్టపోయింది. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టిన ధోనీ, ఇంకో ఓవర్ ఉండుంటే కచ్చితంగా చెన్నైని గెలిపించేవాడు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై దుమారం రేగుతోంది. అతను చివరలో రావడం క్రికెట్ లవర్స్ ని నిరాశపరుస్తోంది. నిజానికి నాలుగో వికెట్ పడిన తర్వాత ధోనీ వస్తే… జట్టుకు ఉపయోగంగా ఉంటుంది. లాస్ట్ లో బాల్స్ లేకుండా వచ్చినా ప్రయోజనం లేదు. గతంలో జట్టు అవసరాలకు తగ్గట్టుగా ధోనీ తన బ్యాటింగ్‌ పొజిష్‌ష మార్చుకునేవాడు. ఇప్పుడా పరిస్థితి లేదు. నాలుగో స్థానం తర్వాత వస్తే… మ్యాచ్ లో అద్భుతమే జరుగుతుందంటున్నారు ఫ్యాన్స్.