Dhoni, Matisha Pathirana : ధోనీ నాకు తండ్రి లాంటివాడు… వచ్చే సీజన్ కూడా ఆడాలన్న యువ బౌలర్

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేశాడు. ధోనీ వల్ల చాలా నేర్చుకున్నానని, ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టంగా అభివర్ణించాడు.

 

 

శ్రీలంక యంగ్ పేస్ బౌలర్ మతీషా పతిరాన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటుతున్నాడు.లసిత్ మలింగను గుర్తు చేసేలా బంతులను సంధించే ఈ యువ బౌలర్..

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికెత్తేశాడు. ధోనీ వల్ల చాలా నేర్చుకున్నానని, ఆయనతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టంగా అభివర్ణించాడు. ధోనీ తన కేరీర్‌ను తీర్చిదిద్దుతున్నాడని, తండ్రి పాత్రను పోషిస్తోన్నాడని చెప్పుకొచ్చాడు.

క్రికెట్‌లో తన ఎదుగుదలకు ధోనీ ఎంతగానో సహకరిస్తోన్నాడని, అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నందున విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తోన్నాడని చెప్పాడు. తన పట్ల ఎంతో ఆప్యాయతను చూపుతున్నాడని, ఓ తండ్రిలా మార్గదర్శకం చేస్తోన్నాడని కితాబిచ్చాడు.

ఇంట్లో తండ్రి తనతో ఎలా వ్యవహరిస్తారో.. జట్టులో ధోనీ తన పట్ల అంతే కేర్ తీసుకుంటాడని మతీషా పతిరానా వ్యాఖ్యానించాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ధోనీ ఇచ్చే చిన్న చిన్న సలహాలు సైతం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయని, వాటి వల్ల తాను క్రికెట్‌లో పరిణతి సాధించానని వివరించాడు.వచ్చే సీజన్‌లో కూడా ధోనీ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాలని తాను బలంగా కోరుకుంటోన్నానని మతీషా చెప్పాడు. తనలాంటి యంగ్ క్రికెటర్ల కోసమైనా ధోనీ ఐపీఎల్ 18వ సీజన్ ఖచ్చితంగా ఆడాలని రిక్వెస్ట్ చేశాడు. ప్రతి యంగ్ క్రికెటర్‌కూ ధోనీ ఓ పాఠం లాంటివాడని, ఆయన నుంచి స్ఫూర్తిని పొందుతున్నామని వ్యాఖ్యానించాడు.