Dhruv Jurel: జురెల్‌కు ఎంజీ మోటార్స్ గిఫ్ట్.. కారు విలువ ఎంతంటే..

కెరీర్ రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన ధ్రువ్ జురెల్‌కు ఎమ్‌జీ మోటార్స్ ఇండియా సంస్థ భారీ బహుమతిని ప్రకటించింది. దాదాపు 16 లక్షల విలువ గల ఎమ్‌జీ హెక్టార్ కారును ధ్రువ్ జురెల్‌కు బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 03:50 PM IST

Dhruv Jurel: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అసాధారణ బ్యాటింగ్‌తో ధ్రువ్ జురెల్ ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. కెరీర్ రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన ధ్రువ్ జురెల్‌కు ఎమ్‌జీ మోటార్స్ ఇండియా సంస్థ భారీ బహుమతిని ప్రకటించింది.

Krish Jagarlamudi: ఇంకా ఎవరున్నారు..? డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు

దాదాపు 16 లక్షల విలువ గల ఎమ్‌జీ హెక్టార్ కారును ధ్రువ్ జురెల్‌కు బహుమతిగా అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడదల చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే 46 పరుగులతో సత్తా చాటాడు. కీపింగ్‌లో ఓ క్యాచ్ అందుకోవడంతో పాటు స్టంపౌట్ చేశాడు. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో అదే జోరును కొనసాగించిన ధ్రువ్ జురెల్.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడిన జట్టును అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన జురెల్ ఇంగ్లాండ్‌కు భారీ ఆధిక్యం రాకుండా అడ్డుకున్నాడు.

ధ్రువ్ జురెల్ అసాధారణ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 192 పరుగుల లక్ష్యచేధనతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్.. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధ్రువ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో భారత్ విజయం లాంఛనమైంది.