KL Rahul: ఆడింది చాలు.. రెస్ట్ తీసుకో.. కేఎల్‌ రాహుల్‌పై దినేశ్ కార్తిక్‌ రియాక్షన్‌

కొంతకాలంగా ఫామ్ లేక అటకెక్కిన ఆటతీరుతో ఇబ్బంది పడుతున్న రాహుల్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలోని తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ చేతులేత్తేశాడు.

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 02:17 PM IST

కేఎల్‌ రాహుల్‌ చుట్టూ జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. చేతన్‌ శర్మ ఎపిసోడ్ తర్వాత.. రాహుల్‌ను టార్గెట్‌ చేసే వేళ్లు మరిన్ని పెరిగాయ్! అయ్యగారు అర్థసెంచరీ కొట్టి ఏడాది దాటింది. ఐనా జట్టులో స్థానానికి ఢోకా లేదు. కేఎల్‌ రాహుల్‌కు ఇన్ని అవకాశాలు ఎందుకు.. నిజంగా టాలెంట్ ఉన్న ప్లేయర్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయ్ అంటూ మాజీల నుంచి అభిమానుల వరకు విమర్శలు వినిపిస్తున్నాయ్. పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని జట్టు నుంచి తీసేయాలని పలువురు మాజీలు సూచించారు.

ఐతే టీమిండియా ప్లేయర్‌ దినేష్ కార్తీక్ కూడా.. కేఎల్ రాహుల్ విషయంలో సేమ్ రియాక్ట్ అయ్యాడు. మాజీల్లానే తన అభిప్రాయాన్ని తెలిపినా.. రాహుల్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒక సందర్భంలో బాధ తట్టుకోలేక వాష్‌రూంకు వెళ్లి మరీ కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నాడు. రాహుల్‌ మంచి ప్లేయరే అయినా.. కొన్ని రోజులుగా అతడు గాడి తప్పాడన.. అతడిని రానున్న మ్యాచ్‌లకు తొలగిస్తే… దానికి కారణాలు కూడా కేఎల్‌కు స్పష్టంగా తెలుసు అంటూ డీకే చెప్పుకొచ్చాడు. రాహుల్‌ కొంతకాలం విరామం తీసుకోవాలని… తిరిగి పుంజుకుని జట్టులోకి తిరిగి రావాలని దినేశ్ కార్తిక్ సూచించాడు.

కొంతకాలంగా ఫామ్ లేక అటకెక్కిన ఆటతీరుతో ఇబ్బంది పడుతున్న రాహుల్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలోని తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ చేతులేత్తేశాడు. ఈ కారణంగానే అతడిని జట్టు నుంచి తొలగించాలని అటు మాజీల నుంచి, క్రీడాభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయ్.