Dunith Wellalage: ఆ రెండు వికెట్లు మాత్రం నా లైఫ్ టైం సెటిల్మెంట్: దునిత్ వెల్లలాగే

ప్రపంచ స్థాయి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరి వికెట్లను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెబుతున్నాడు. 40 పరుగులకే 5 వికెట్లు తీశాడు వెల్లలాగే.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 06:44 PM IST

Dunith Wellalage: శ్రీలంక న్యూ సెన్సేషన్ దునిత్ వెల్లలాగే.. భారత్‌తో మ్యాచ్ ఓడిపోయినా అందరి మనుసుల్ని మాత్రం గెలుచుకున్నాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ఇటు బౌలింగ్‌లోనూ, అటు బ్యాటింగ్‌లోనూ ఇండియా టీంకు ముచ్చెమటలు పట్టించాడు. సూపర్ 4లో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో తన స్పిన్‌తో భారత స్టార్ బ్యాటర్లను కట్టిపడేశాడు. కేవలం 213 పరుగులకే ఇండియా ఆలౌట్ కావడానికి కారకుడయ్యాడు. భారత టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చాడు.

మరోవైపు బ్యాటింగ్‌లో కూడా చివరిదాకా నిలబడి శ్రీలంకను గెలిపించే ప్రయత్నం చేశాడు. శ్రీలంక ఓడిపోయినప్పటికీ ఈ కుర్రాడు మాత్రం ఒక విషయంలో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ప్రపంచ స్థాయి బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరి వికెట్లను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ చెబుతున్నాడు. 40 పరుగులకే 5 వికెట్లు తీశాడు వెల్లలాగే. కోహ్లీ, రోహిత్‌తోపాటు హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వికెట్లు కూడా పడగొట్టాడు. టీంలో ఉన్న స్టార్ బ్యాటర్లందరిని ఫెవిలియన్‌కు పంపాడు. ఇటు బౌలింగ్‌లో సత్తా చాటిన వెల్లలాగే, బ్యాటింగ్‌లో భారత్‌ని కలవరపెట్టాడు. సీనియర్ ప్లేయర్లు ఒక్కక్కరుగా ఔట్ అవుతున్నా.. చివరిదాకా క్రీజులో నాటౌట్‌గా నిలిచాడు.

వెల్లలాగే 46 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వాతో కలిసి ఏడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక విజయవకాశాలు మెరుగయ్యాయి. కానీ, భారత్ స్పిన్నర్లు పుంజుకోవడంతో శ్రీలంక 172 పరుగులకే ఆలౌట్ అయ్యి, 41 పరుగుల తేడాతో ఓడిపోయింది.