England Vs Australia: అసలే ఓడిపోతున్నాం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు..

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో మూడో టెస్టుకు ముందు, గాయం కారణంగా ఆ జట్టు వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ యాషెస్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 03:35 PM IST

ఈ విషయాన్ని ఐసీసీ, ఇంగ్లండ్ క్రికెట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. భుజం గాయం కారణంగా వచ్చే యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఒల్లీ పోప్ దూరమైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన ఒలీ పోప్‌కి నిన్న భుజాన్ని స్కాన్ చేశారు. చెకప్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆదేశించారంట. భుజానికి గాయమైన పోప్ ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. శస్త్రచికిత్స తర్వాత, అతను ఇంగ్లాండ్‌లోని వైద్య బృందం మార్గదర్శకత్వంలో కోలుకునే ప్రక్రియను ప్రారంభిస్తాడు. అందుకే ఈ సిరీస్ నుంచి పోప్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

లార్డ్స్ టెస్టులో తొలిరోజు ఓలీ పోప్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పోప్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డాడు. గాయం ఉన్నప్పటికీ, మొదటి ఇన్నింగ్స్‌లో నిర్ణయాత్మక 42 పరుగులు చేసిన పోప్, రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం మూడు పరుగులకే ఇన్నింగ్స్‌ను ముగించాడు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఆలీ పోప్ ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 45 పరుగులు చేసిన పోప్ రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 45 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను కోల్పోయిన ఆతిథ్య ఇంగ్లండ్ సిరీస్‌లో నిలవాలంటే తదుపరి మ్యాచ్‌లో గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది.

సిరీస్‌లో ఇంగ్లండ్ 0-2తో వెనుకంజలో ఉంది. సిరీస్‌లో మరో మూడు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌కు కూడా సిరీస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే అందుకు మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. దీంతో ముందు సిరీస్‌లో నిలవాలంటే మూడో టెస్టులో విజయం సాధించాల్సి ఉంటుంది.