Akash Chopra: వివాదం మూసుకో అంటున్న విరాట్ ఫ్యాన్స్

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా మారిన ఆకాశ్ చోప్రాపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మూడు రోజుల క్రితం చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా.. కోహ్లీ ఇక టెస్టులలో ఎంతమాత్రమూ ప్రమాదకర ఆటగాడు కాదని, అతడిని ఫ్యాబ్ - 4 నుంచి తప్పించాలని వ్యాఖ్యానించాడు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 06:37 PM IST

ఈ కామెంట్స్ కోహ్లీ అభిమానులను ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో చోప్రాను కోహ్లీ ఫ్యాన్స్ ఆటాడుకుంటున్నారు. ‘అసలు నీ గురించి పట్టించుకునేదెవడు..?, నువ్వు చెప్పింది వినేదెవడు..?’ అంటూ ఫైర్ అవుతున్నారు. కోహ్లీ ఇటీవల కాలంలో టెస్టులలో వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో మూడు రోజుల క్రితం యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..‘ఫ్యాబ్ 4 ఇక ఎంతమాత్రమూ ఉనికిలో లేదు. దాని నుంచి కోహ్లీ తప్పుకున్నట్టే. ఇక దానిని ఫ్యాబ్ 3 అని పిలుచుకోవడమే బెటర్. కోహ్లీకి బదులు పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను ఈ లిస్ట్‌లో చేర్చాలి. కానీ ఇప్పుడే కాదు. దానికింకా టైమ్ ఉంది.

ఇప్పటికైతే ఫ్యాబ్ -3 మాత్రమే ఉంది..’ అని కామెంట్స్ చేశాడు. ఆకాశ్ తన వీడియోలోనే కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘టెస్టులలో కోహ్లీ గణాంకాల గురించి మనం మాట్లాడుకుంటే .. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అతడు పీక్స్ చూశాడు. ఆ ఐదేండ్ల కాలంలో కోహ్లీ.. 62 టెస్టులలో 58.71 సగటుతో ఏకంగా 5,695 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు కూడా ఉన్నాయి. అప్పుడు కోహ్లీ అన్‌స్టాపబుల్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఏకంగా నాలుగు డబుల్ సెంచరీలు చేసి సంచలనాలు సృష్టించాడు. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ లేదు. 2020 తర్వాత టెస్టులలో కోహ్లీ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. ఈ ఫార్మాట్‌లో అతడు ఇంకెంతమాత్రమూ ప్రమాదకర బ్యాటర్ అయితే కాదు..’ అని వ్యాఖ్యానించాడు. విరాట్ ఫ్యాన్స్…. మిస్టర్ ఆకాశ్.. ఫ్యాబ్ -4 అనేది ర్యాంకింగ్ కాదు. అది మారుతూ ఉండటం, మోడీఫైడ్ చేయడం ఉండదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని కౌంటర్ ఇచ్చారు. మరికొందరైతే ‘అసలు నువ్వు చెప్పేది వినేది ఎవడు..? నిన్ను పట్టించుకునేది ఎవడు..? నీ అభిప్రాయం ఎవడికి కావాలి..?’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు