IPL 2024 : ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివరీ… అరంగేట్రంలోనే యువ పేసర్ రికార్డు

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ (IPL) లో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు.

 

 

 

లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ (IPL) లో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తో మ్యాచ్‌తో డెబ్యూ చేసిన మయాంక్‌ .. తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ పంజాబ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 8 ఓవర్ల తర్వాత బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చిన మయాంక్‌.. బెయిర్ స్టోను ఔట్ చేసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తీసుకువచ్చాడు. ఆ తర్వాత ప్రభుసిమ్రాన్ సింగ్‌ (Prabhusimran Singh) , జితేష్ శర్మలను ఔట్ చేసాడు. ఓవరాల్‌గా మయాంక్ తన నాలుగు ఓవర్లలో కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

అంతేకాకుండా ఐపీఎల్‌-2024లో ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. 11 ఓవర్‌లో తొలి బంతిని 155.8 కి.మీ వేగంతో మయాంక్ బౌలింగ్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు రాజస్తాన్ పేసర్ నండ్రీ బర్గర్‌ పేరిట ఉండేది. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఫాసెస్ట్ డెలివరీ వేసిన 5వ బౌలర్‌గా యాదవ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన యువ పేసర్ దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.