Star Sports: 1 సెకండ్ కు 3 లక్షలు క్రేజ్ అంటే ఇదీ

భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 04:00 PM IST

ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ మ్యాచ్‌ అభిమానులకు మజాను అందించడమే కాకుండా.. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు కాసుల వర్షం కురిపించనుంది. ప్రపంచకప్ 2023లోని అన్ని మ్యాచ్‌లోకెల్లా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అత్యధిక వ్యూయర్ షిప్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వర్టైజమెంట్ పరంగానూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ బ్రాడ్ కాస్టర్‌కు బాగా కలిసిరానుందట. వన్డే ప్రపంచకప్ 2023 అడ్వర్టైజమెంట్స్‌కు సంబంధించిన వివరాలను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిందని ఎక్స్‌ఛేంజ్‌ ఫర్ మీడియా పేర్కొంది.

ఆ వివరాల ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ సమయంలో10 సెకన్లకు రూ. 30 లక్షల రూపాయలు వసూలు చేయాలని స్టార్ స్పోర్ట్స్ నిర్ణయం తీసుకుందట. ఐపీఎల్ 2023 ఓటీటీ రైట్స్ కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న స్టార్ స్పోర్ట్స్.. ఆ లోటును తీర్చుకునే ఇంత వసూల్ చేయాలని చూస్తోందట. గతంలో10 సెకన్ల యాడ్‌కు రూ. 6-7 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లను ఉచితంగా అందిస్తామని ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్.. అడ్వర్టైజ్‌మెంట్ రేట్స్‌ను మాత్రం భారీగా పెంచింది. కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజు రూ. 150 కోట్లుగా నిర్ణయించిందట. ఇక అసోసియేట్ స్పాన్సర్స్ స్లాట్ ఫీజు రూ. 88 కోట్లుగా ఉంచిందని సమాచారం. పవర్డ్ బై స్పాన్సర్‌ కావాలనుకునే బ్రాండ్‌లు రూ. 75 కోట్లు చెల్లించాలి. అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ను ఎంచుకునే బ్రాండ్‌లు రూ. 40 కోట్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.