Bhumra: నువ్ రావాలయ్యా

భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలవాలంటే జట్టులో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 07:10 PM IST

బుమ్రా లేకుంటే జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా మారుతుందని తెలిపాడు. ‘సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌లో భారత్ అవకాశాలు మెరుగ్గా ఉండాలంటే ఒకటే మార్గం. గాయపడి వచ్చిన ఆటగాళ్లంతా సత్తా చాటాలి అని కైఫ్ అన్నాడు. అతని ఫిట్‌నెస్‌ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఐర్లాండ్ పర్యటన ఉపయోగపడుతోంది. వరల్డ్‌ కప్‌ నాటికి అతను పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా తయారవుతోంది. ఒకవేళ బుమ్రా ఈసారి మెగా టోర్నీలోనూ ఆడకపోతే భారత్‌కు చాలా నష్టం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో తెలుసు. అతనికి బ్యాకప్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ మనకు లేరు. ఇప్పుడైతే పేపర్‌ మీద భారత్‌ బలమైన జట్టుగా నాకు కనిపించడం లేదు. కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, శ్రేయస్ అయ్యర్‌తోపాటు బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తోంది. భారత్‌ తప్పకుండా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. సెమీస్‌, ఫైనల్‌కు చేరుకొని కప్‌ను అందుకోవాలంటే మాత్రం మరింత కష్టపడాలి” అని కైఫ్‌ పేర్కొన్నాడు.