Bishan Singh Bedi: లెజెండరీ క్రికెటర్ ఇక లేరు.. అనారోగ్యంతో బిషన్‌సింగ్ బేడి కన్నుమూత..!

బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్‌ల్లో విన్నర్‌గా నిరూపించుకున్నాడు. 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 28.71 సగటుతో 266 వికెట్లు పడగొట్టాడు. అప్పట్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - October 23, 2023 / 05:22 PM IST

Bishan Singh Bedi: టీమిండియా స్పిన్ లెజెండ్‌.. బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేడీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 1946 సెప్టెంబర్ 25న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్‌ల్లో విన్నర్‌గా నిరూపించుకున్నాడు. 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 28.71 సగటుతో 266 వికెట్లు పడగొట్టాడు.

అప్పట్లో భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బౌలింగ్‌తో పాటు బిషన్ సింగ్ బేడీకి నాయకత్వ సామర్థ్యం కూడా ఉంది. 1976లో టీమిండియాకు కెప్టెన్‌ అయ్యాడు. 1978 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. జట్టులో పోరాట పటిమను నింపి, క్రమశిక్షణకు సంబంధించి కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పిన కెప్టెన్‌గా బిషన్ సింగ్ బేడీకి పేరుంది. కెప్టెన్‌గా బిషన్ సింగ్ బేడీ.. 1976లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. బిషన్ సింగ్ బేడీకి క్రికెట్‌పై ఇష్టం పోలేదు. చాలా కాలం పాటు బేడీ వ్యాఖ్యాతగా క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. కోచ్‌గా కూడా బిషన్ సింగ్ బేడీ చాలా కాలం క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా.. స్పిన్ విభాగంలో భారత్‌ను పటిష్టంగా ఉంచడానికి బిషన్ సింగ్ బేడీ కొత్త ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. చివరి క్షణం వరకు భారత క్రికెట్‌కు ముఖ్యమైన సేవలను అందించాడు.

దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ టీమ్‌కు ఆడిన బేడీ.. రిటైర్మెంట్ తర్వాత పలువురు వర్ధమాన క్రికెటర్లకు కోచ్, మెంటార్‌గా పనిచేశారు. కామెంటేటర్‌గానూ క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు బేడీ మేనేజర్‌గా వ్యవహరించారు. జాతీయ సెలెక్టర్‌గా, మెంటార్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. మురళీ కార్తీక్, మణిందర్ సింగ్ లాంటి బౌలర్లను వెలుగులోకి తీసుకువచ్చాడు.