MS Dhoni: నాటి రిజెక్టెడ్ కీపర్.. నేటి రికార్డుల టాపర్..!

అయితే ఒకప్పుడు వికెట్ కీపింగ్, బ్యాటింగ్, ఫిట్ నెస్ బాగున్నా కూడా ధోనిని కీపింగ్ విషయంలో అనుమానించాల్సి వచ్చిందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 05:31 PM IST

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వికెట్ కీపర్‌గా అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. రెప్పపాటులో స్టంపింగ్స్ చేయడం.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేయడం.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేయడం ధోనీకే సాధ్యమైంది.

అయితే ఒకప్పుడు వికెట్ కీపింగ్, బ్యాటింగ్, ఫిట్ నెస్ బాగున్నా కూడా ధోనిని కీపింగ్ విషయంలో అనుమానించాల్సి వచ్చిందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. కీపర్‌గా ఫుట్‌వర్క్ మెరుగుపరుచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించానని, ఈ మాటలను సీరియస్‌గా తీసుకున్న ధోనీ, ఆ తరవాత క్రియేట్ చేసిన హిస్టరీస్ మనకు తెలిసిందే అని కరీం గర్వించాడు. ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.