Pak Cricketers: భారత విజయాలపై పాక్ మాజీల అక్కసు.. పరువు తీసేసుకుంటున్నారుగా..!

పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు కొందరు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. అనవసరమైన విషయాలను లేవనెత్తి వివాదాస్పదంగా మార్చడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. తొలుత విభిన్న బంతులు అన్నారు.. ఆ తర్వాత డీఆర్‌ఎస్‌పై పడ్డారు.

  • Written By:
  • Updated On - November 17, 2023 / 04:55 PM IST

Pak Cricketers: వరుసగా విజయాలు సాధిస్తున్న టీమ్‌ఇండియా ప్రదర్శనను తక్కువగా చేయడానికి ప్రయత్నిస్తూ.. పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు కొందరు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. అనవసరమైన విషయాలను లేవనెత్తి వివాదాస్పదంగా మార్చడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. తొలుత విభిన్న బంతులు అన్నారు.. ఆ తర్వాత డీఆర్‌ఎస్‌పై పడ్డారు.. తాజాగా టాస్‌ సందర్భంగా కాయిన్‌ వేసే పద్ధతిపైనా ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ హసన్ రజా ఆ దేశం తరఫున ఆడింది కేవలం 23 అంతర్జాతీయ మ్యాచులే.

CM KCR: రైతులు గడపదాటకుండా నగదు జమ చేస్తున్నాం.. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్: సీఎం కేసీఆర్

అందులోనూ ఏడు టెస్టులు, 16 వన్డేలు ఉన్నాయి. మొత్తం 500 పరుగులు కూడా లేవు. కానీ, టీమ్‌ఇండియా గెలుపును మాత్రం తక్కువ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. ఈ వరల్డ్ కప్‌లో భారత్ లీగ్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. కానీ, పాక్‌ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడింది. టీమ్‌ఇండియా పేసర్లు విజృంభించి ప్రత్యర్థులను కట్టడి చేశారు. దీంతో టీమ్ఇండియా విభిన్న బంతులను వాడటం వల్లే గెలిచిందనే ఆరోపణలను గుప్పించాడు. ఆ తరవాత డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ను ట్యాంపరింగ్‌ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రజా వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు సికిందర్ భక్త్‌ ఈసారి ఏకంగా టాస్‌ కాయిన్‌ వేసే పద్ధతిపై చేసిన వ్యాఖ్యలు ఆ దేశ మాజీలకే అసహనం కలిగించాయి.

ఇలాంటివి చేసి తమను నవ్వులపాలు చేయొద్దని చురకలు అంటించారు. ఇతర కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ టాస్‌ వేసే విధానం విచిత్రంగా ఉంది అని సికిందర్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకీ సికిందర్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో 26 టెస్టులు, 27 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి తమ పరువు తీయొద్దని పాక్‌ మాజీలు వసీమ్‌ అక్రమ్‌, షోయబ్ మాలిక్‌ చురకలు అంటించారు.