Harthikak, Gambhir : హార్థిక్ కు గంభీర్ కండీషన్లు..లేకుంటే వన్డే జట్టులో నో ప్లేస్

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే జట్టు ఎంపికలో తన మాటను నెగ్గించుకున్న గంభీర్ కొన్ని విషయాల్లో రాజీ పడడం లేదు.

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే జట్టు ఎంపికలో తన మాటను నెగ్గించుకున్న గంభీర్ కొన్ని విషయాల్లో రాజీ పడడం లేదు. సీనియర్లు , జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తన కండీషన్లు ఫాలో అవ్వాల్సిందేనని తేల్చి చెప్పేశాడు. ప్రతీ ప్లేయర్ ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. బీసీసీఐ సెలక్టర్లు కూడా గంభర్ మాటకే ఓటేశారు. కేవలం ఐపీఎల్ తో జాతీయ జట్టులోకి వచ్చి కొన్ని మ్యాచ్ లకే పరిమితమయ్యేలా కాకుండా సుదీర్ఘ లక్ష్యాలతో కొనసాగాలన్నది గంభీర్ ఆలోచన. తాజాగా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా విషయంలోనూ ఇదే మాట చెప్పినట్టు తెలుస్తోంది.

హార్థిక్ వన్డేజట్టులో బౌలింగ్ చేస్తే చూడాలని ఉందని గంభీర్ సెలక్టర్లతో చెప్పినట్టు సమాచారం. దీని కోసం అతను ఫిట్ నెస్ నిరూపించుకోవాలని, దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ విషయంలో రాజీపడేది లేదని సెలక్టర్లకు కూడా గంభీర్ ఖరాఖండీగా చెప్పేశాడు. దీంతో మళ్ళీ వన్డే జట్టులో రీఎంట్రీ ఇవ్వాలంటే హార్థిక్ పాండ్యా ఫిట్ నెస్ పై ఫోకస్ చేయాల్సిందే. అలాదే దేశవాళీ క్రికెట్ లో కొన్ని మ్యాచ్ లు ఆడాలి. ఇప్పటికే టెస్ట్ స్పెషలిస్టులకు బీసీసీఐ ఇవే ఆదేశాలిచ్చింది.