ఐపీఎల్ 2025 సీజన్ కోసం బీసీసీఐ సన్నాహాలు మొదలయ్యాయి. దీని కంటే ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుండగా.. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్స్ జాబితాపై ఫోకస్ పెట్టాయి. అటు కొందరు ఆటగాళ్ళు తమ తమ పాత ఫ్రాంచైజీలను వదిలి వేలంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ , వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ ఫ్యూచర్ పై పలు ఊహాగానాలు వస్తున్నాయి.
జన్ మెగా వేలం నేపథ్యంలో జట్టు మారుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు రిషభ్ పంత్.. చెన్నై సూపర్ కింగ్స్ కు వెళతాడని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకూ అటు పంత్ కానీ, ఇటు చెన్నై కానీ స్పందించలేదు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గా ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. పంత్ జట్టు మారతాడనే వార్తలను కొట్టిపారేశాడు. రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే ఉంటాడని, అతనే కెప్టెన్‌గా కొనసాగుతాడని దాదా స్పష్టం చేశాడు. ప్రస్తుతం హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రికీ పాంటింగ్ మాత్రమే తప్పుకున్నాడని, మిగిలిన మార్పులపై కొంచెం సమయం పడుతుందన్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్ గా భారత్‌కు చెందిన మాజీ ఆటగాడే బాధ్యతలు తీసుకుంటాడని దాదా వెల్లడించాడు. దీంతో ఆ ఆటగాడు ఎవరై ఉంటారా అనే చర్చ జరుగుతోంది. గంగూలీనే ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది.