Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ క్రికెట్‌లో ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో సందేహమే లేదన్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అలాంటి నాయకుడు లేడని, మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన ఏకైక టీమ్ ఇండియా కెప్టెన్ ఘనత అతనికే దక్కిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Rohit Sharma: రోహిత్‌పై కన్నేసిన సన్ రైజర్స్.. కావ్య పాప ఆఫర్ ఏంటో తెలుసా ?
చెన్నైతో మ్యాచ్ జరగనుండగా గౌతమ్ గంభీర్ మాట్లాడిన వీడియోను ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. స్నేహితులైనా సరే పరస్పరం గౌరవించుకోవాలన్నాడు. తాను కోల్‌కతా సారథిగా ఉన్నప్పుడు, ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడనీ, ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పుడు ఇద్దరం గెలుపు కోసమే కష్టపడతామన్నాడు. ఇదే ప్రశ్న ధోనీని అడిగినా అతడు ఇదే చెబుతాడనీ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‌లో ధోనీ లాంటి సారథి లేడన్నాడు. అలాగే ఐపీఎల్‌లో ధోనీకి ప్రత్యర్థిగా బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుందన్నాడు. వ్యూహాలకు పదునుపెట్టే అతని మైండ్‌సెట్ అద్భుతమన్న గంభీర్.. ఒక్కో బ్యాటర్‌కు ఎలా ఫీల్డింగ్‌ను సెట్ చేయాలనేది అతడికి బాగా తెలుసన్నాడు.
చివరి బంతి వరకూ మ్యాచ్‌ను చేజారనివ్వడనీ, అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్‌ను ముగిస్తాడన్నాడు. చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరమైనా భయపడటం చూడలేదన్నాడు. చెన్నై బ్యాటర్లకు బౌలింగ్ చేయడమంటే కఠిన సవాల్‌గా చెప్పిన గౌతీ.. విజయం సాధించేవరకూ పోరాడతామంటూ చెప్పుకొచ్చాడు.