ఐపీఎల్ మెగా వేలం అతనికి రూ.5 కోట్లు కూడా కష్టమేనా ?

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి విదేశీ స్టార్ ప్లేయర్స్ లో ఎవరిపై కాసుల వర్షం కురుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆల్ రౌండర్లకు ఐపీఎల్ లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - August 31, 2024 / 09:11 PM IST

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి విదేశీ స్టార్ ప్లేయర్స్ లో ఎవరిపై కాసుల వర్షం కురుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆల్ రౌండర్లకు ఐపీఎల్ లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఆల్ రౌండర్లలో పలువురు స్టార్ ప్లేయర్స్ తో పాటు యువ ఆటగాళ్ళు కూడా భారీ ధర పలుకుతారన్న అంచనాలున్నాయి. కాగా
ఎన్నో మ్యాచ్ లలో ఒంటిచేత్తో విజయాలను అందించిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ ఈ సారి ఎన్ని కోట్లు పలుకుతాడోనని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే మెగావేలంలో మ్యాక్సీ 5 కోట్లు మించి పలకకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.

ముఖ్యంగా గత సీజన్ లో మాక్స్ వెల్ పేలవ ఫామ్ మొదటి కారణం…10 మ్యాచ్ లు ఆడిన మ్యాక్సీ కేవలం 52 పరుగులే చేశాడు. ఒత్తిడి కారణంగా కొన్ని మ్యాచ్ ల నుంచి తానే తప్పుకున్నాడు. 2022 సీజన్ కోసం ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను ఆర్సీబీ 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. పేలవ ఫామ్ కారణంగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి అతన్ని రిటైన్ చేసుకోవడం లేదని చెప్పొచ్చు. అలాగే గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు కూడా మ్యాక్స్ వెల్ కు ఇబ్బందిగా మారాయి. వయసును దృష్టిలో ఉంచుకుని అదే సమయంలో ఫ్రాంచైజీలు తమ మనీ పర్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటే మాక్స్ వెల్ కు 5 కోట్లు లోపే ధర వస్తుందని అంచనా వేస్తున్నారు.