Glenn Maxwell: ప్రపంచ కప్‌లో సంచలనం.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో విధ్వంసం..

గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర డబుల్ సెంచరీతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపొందింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సెవెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి విరోచిత డబుల్ సెంచరీతో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 12:20 PM IST

Glenn Maxwell: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా (Australia) సంచలన విజయాన్నందుకుంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) విధ్వంసకర డబుల్ సెంచరీ (double century)తో ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపొందింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సెవెల్ 128 బంతుల్లో 21 ఫోర్లు 10 సిక్సర్లతో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి విరోచిత డబుల్ సెంచరీతో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది.

Anasuya Bharadwaj: అనసూయ సెన్సేషనల్ కామెంట్స్.. అడివి శేష్‌ను వదలని అనసూయ

ఇబ్రహీమ్ జడ్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 129 నాటౌట్ రికార్డు సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి గెలుపొందింది. కమిన్స్‌తో కలిసి మ్యాక్సీ 8వ వికెట్‌కు అజేయంగా 202 పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించగా.. అఫ్గాన్ మాత్రం తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 292 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. నవీన్ ఉల్ హక్ వేసిన రెండో ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ డకౌటయ్యాడు. దాంతో నిదానంగా ఆడే ప్రయత్నం చేసిన డేవిడ్ వార్నర్, జోష్ ఇంగ్లీస్లను ఒమార్జాయ్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. రెహ్మత్ షా సూపర్ త్రోకు మార్నస్ లబుషేన్ రనౌటవ్వగా.. మార్కస్ స్టోయినీస్‌ను రషీద్ ఖాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. మిచెల్ స్టార్క్‌‌ను కూడా అతనే ఔట్ చేయడంతో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో అఫ్గాన్ మరో సంచలన విజయం సాధించడం ఖాయమని అంతా అనుకున్నారు.

Payal Rajput: గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్‌పుత్.. లేటెస్ట్ ఫొటోస్..

కానీ క్రీజులోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ సాయంతో గ్లేన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నాడు. తనకే సాధ్యమైన మ్యాడ్ షాట్లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. మ్యాక్సీ విధ్వంసకర బ్యాటింగ్‌తో లయ తప్పిన అఫ్గాన్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. దాంతో ఆ జట్టు పూర్తిగా ఒత్తిడికి లోనైంది. 51 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మ్యాక్స్‌వెల్.. 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 150 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్.. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతూనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మ్యాక్సీ సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన 47వ ఓవర్‌లో బౌలింగ్ 6, 6, 4, 6 బాదిన మ్యాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో పాటు ఆసీస్‌కు సంచలన విజయాన్ని అందించాడు. మ్యాక్స్‌వెల్ ఇచ్చిన క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ నేలపాలు చేయడం అఫ్గాన్ కొంపముంచింది.