అఫ్గనిస్తాన్ (Afghanistan) స్టార్ క్రికెటర్ (Star Cricketer) రషీద్ ఖాన్ (Rashid Khan) పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత రషీద్ ఖాన్ వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్- ఐర్లాండ్ (Afghanistan – Ireland) టీ20 (T20) సిరీస్‌తో తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్టు చెప్పాడు.
వరల్డ్‌కప్ టోర్నీకి ముందుగానే సర్జరీకి వెళ్తే బాగుంటుందని డాక్టర్లు సూచించారనీ. అయితే, ఐసీసీ (ICC) మెగా ఈవెంట్‌లో దేశం తరఫున ఆడాలనే నిర్ణయించుకుని బరిలోకి దిగాలని చెప్పాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐపీఎల్ ఆడటం కూడా తమకు కలిసి వస్తుందని రషీద్ చెప్పుకొచ్చాడు. రషీద్ ఖాన్ రీఎంట్రీ ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద గుడ్ న్యూస్ గానే చెప్పాలి.
ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జట్టును వీడి ముంబై ఇండియన్స్ కు (Mumbai Indians) వెళ్లగా.. మహ్మద్ షమీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రషీద్ ఆగమనం టైటాన్స్‌కు ఊరట కలిగించనుంది. గత సీజన్‌లో రషీద్ ఖాన్ 17 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు తీశాడు.