Mohammed Siraj: మ్యాచ్ మధ్యలో అందిన వార్త.. అందుకే సిరాజ్ బౌలింగ్ ఆపేశాం..

ఆసియా కప్‌ 2023 ఫైనల్‌లో భారత స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఔట్‌, స్వింగ్‌, బౌన్స్ వేసి లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 03:50 PM IST

Mohammed Siraj: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్‌ 2023 ఫైనల్‌లో భారత స్టార్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగిన విషయం తెలిసిందే. ఒకే ఓవర్లో 4 వికెట్స్ పడగొట్టడంతో పాటు మొత్తంగా ఆరు వికెట్స్ తీయడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఔట్‌, స్వింగ్‌, బౌన్స్ వేసి లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లోనే అత్యుత్తమంగా బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన సిరాజ్‌.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్‌ సిరాజ్‌ 7 ఓవర్లను మాత్రమే వేశాడు. స్పిన్నర్లు, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి దింపడంతో సిరాజ్‌ మళ్లీ బౌలింగ్ వేసే అవకాశం రాలేదు. ఐతే మిగిలిన ఓవర్లను కూడా వేయించి ఉంటే.. సిరాజ్‌ ఖాతాలో మరికొన్ని వికెట్లు చేరేవని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఊపు మీదున్న సిరాజ్‌తో మిగిలిన మూడు ఓవర్లు ఎందుకు వేయించలేదని ఫాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సిరాజ్‌ 7 ఓవర్ల స్పెల్‌ను నిర్విరామంగా వేశాడని, అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్‌ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని తెలిపాడు.