Virat Kohli: కోహ్లీకి అంత సీన్ లేదు.. భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ఈ లీగ్‌లో సూపర్ రికార్డున్న కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కోహ్లి ప్రదర్శన ఆకట్టుకనేలా లేదంటూ వ్యాఖ్యానించాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా కష్టమే అన్నాడు.

  • Written By:
  • Updated On - March 12, 2024 / 01:20 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. అన్ని సీజన్లు ఒకే ఫ్రాంచైజీ ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లి మాత్రమే. 237 మ్యాచ్‌ల్లో 7263 పరుగులు చేశాడు. 130 స్ట్రైక్‌రేటుతో పరుగుల వరద పారించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా కోహ్లి ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌తో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ లీగ్‌లో సూపర్ రికార్డున్న కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Raghu Rama Krishna Raju: రఘురామకు బీజేపీ ఝలక్‌.. ప్రభాస్ ఫ్యామిలీకే నరసాపురం టికెట్‌!

చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు కోహ్లి ప్రదర్శన ఆకట్టుకనేలా లేదంటూ వ్యాఖ్యానించాడు. చెన్నైలో సిక్సర్లు సాధించడం గ్లెన్ మాక్స్‌వెల్‌కు కూడా కష్టమే అన్నాడు. ఈ స్టేడియంలో కోహ్లీ ఆటతీరు ఏమంత గొప్పగా లేదంటూ పెదవి విరిచాడు. టెన్నిస్ బాల్‌లా బౌన్స్ అయ్యే ఈ పిచ్ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదన్నాడు. ముఖ్యంగా ఓపెనర్లకు క్లిష్టంగా ఉంటుందని అంచనా వేశాడు. చెపాక్‌లో రెండు వందల స్కోరు ఎక్కువగా సాధ్యం కాదన్న భజ్జీ 2016 సీజన్ తరహాలో కోహ్లి రాణించడం అంత ఈజీ కాదంటూ విశ్లేషించాడు. కోహ్లి పరుగులు సాధిస్తేనే ఆర్సీబీ ముందుకు వెళ్తుందని, వాళ్లు కప్ సాధిస్తారా లేదా అనే విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీ దగ్గర అద్భుత బ్యాటర్లు ఉన్నారనీ వారంతా అంచనాలు అందుకుంటారా అనేది చూడాలన్నాడు. గత సీజన్లలోనూ చాలా మంది స్టార్ ఆటగాళ్లు విఫలమైన సందర్భాలను గుర్తు చేశాడు. కోహ్లీ కూడా ఫెయిలైతే బెంగళూరు లీగ్ స్టేజ్‌కే పరిమితమవుతుందంటూ వ్యాఖ్యానించాడు. కాగా మార్చి 22 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు, చెన్నైతో తలపడనుంది.