భారత క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ చేయడం కొత్తేమీ కాదు… బాలీవుడ్ తో భారత క్రికెట్ లవ్ రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుత తరంలో హార్థిక్ పాండ్యా తన లవ్ స్టోరీని ఖండాంతరాలు దాటించేస్తున్నాడు. గతంలో సెర్బియా మోడల్, నటి నటాషా స్టాంకోవిచ్ తో డేటింగ్ చేసిన పాండ్యా తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకుని కరోనా సమయంలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. దీంతో కొడుకు అగస్త్యను తీసుకుని నటాషా సెర్బియా వెళ్ళిపోయింది. తాజాగా హార్థిక్ పాండ్యాకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారింది. హార్థిక్ బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా డేటింగ్ చేస్తున్నట్టు రూమార్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇదే స్విమ్మింగ్ పూల్ దగ్గర నాలుగు రోజుల క్రితం జాస్మిన్ వాలియా కూడా ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌లను ఒకరికొకరు లైక్ చేయడం కూడా తాజా రూమార్స్ కు మరింత బలాన్నిచ్చింది. గతంలోనూ జాస్మిన్ పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్యా కామెంట్స్ చేశాడు. దీంతో బ్రిటీష్ యాక్టర్ తో పాండ్యా కొత్త లవ్ స్టోరీ మొదలైందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ కు చెందిన జాస్మిన్ టీవీ సిరీస్ లతో పాటు రియాల్టీ షోలు, పలు ఆల్బమ్ లతో ఫ్యాన్స్ కు పరిచయమే.