Prasidh Krishna: టీమ్‌ఇండియా (Team India) అభిమానులకు షాకింగ్ న్యూస్. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) నుంచి హార్దిక్ తప్పుకున్నట్టు ICC అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ సమయంలో బంతిని ఆపేందుకు ప్రయత్నించిన హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో జాతీయ క్రికెట్ అకాడమీకి (NCA)కి వెళ్ళాడు. మొదట మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని BCCI అధికారులు చెప్పారు. కానీ గాయం తీవ్రత వల్ల హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిధ్ కృష్ణను భారత జట్టులోకి తీసుకున్నారు.
ప్రపంచ కప్‌లోని మిగతా మ్యాచెస్‌కు దూరం అవుతున్నానన్న వాస్తవాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని హార్డిక్ పాండ్య ట్వీట్ చేశాడు. కానీ టీమిండియాలో స్పిరిట్ నింపుతానని చెప్పాడు. తను కోలుకోవాలని కోరుకుంటున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. హార్దిక్ పాండ్య ఈ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మూడు బంతులు మాత్రమే వేశాడు. అంతకు ముందు మూడు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. అతనికి ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అందులోనూ 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న భారత్ జట్టులో హార్డిక్ ఆడకపోవడం నిరాశ కలిగించే వార్తే. అయితే మిగతా బౌలర్లంతా విజృంభించి ఆడుతుండటం కలిసొస్తోంది.
ఎవరీ ప్రసిధ్ కృష్ణ..?
కర్ణాటక, బెంగళూరుకు చెందిన ఈ 27యేళ్ళ మురళీ కృష్ణ ప్రసీధ్ కృష్ణ (Prasidh Krishna) ఫాస్ట్ మీడియం బౌలర్. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్నేషనల్ మ్యాచుల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికి 17 వన్డే మ్యాచులు ఆడిన ప్రసిధ్ కృష్ణ.. 29 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున IPL లో ఆడుతున్నాడు.