కోహ్లీ రికార్డు బద్దలైంది బ్రూక్ అరుదైన ఘనత

ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఆసీస్ పై వన్డే సిరీస్ లో అదరగొడుతున్న బ్రూక్ తాజాగా కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు.

  • Written By:
  • Publish Date - September 30, 2024 / 04:07 PM IST

ఇంగ్లండ్ యంగ్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఆసీస్ పై వన్డే సిరీస్ లో అదరగొడుతున్న బ్రూక్ తాజాగా కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. ఆసీస్ తో జరిగిన ఐదో వన్డేలో బ్రూక్ 52 బంతుల్లో 72 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‍లో కెప్టెన్‍గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‍లో బ్రూక్ 312 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఐదు మ్యాచ్‍ల్లో మొత్తంగా 30 ఫోర్లు, 13 సిక్స్‌లు కొట్టాడు. ఆస్ట్రేలియాపై 2019 ద్వైపాక్షిక సిరీస్‍లో భారత సారథిగా ఉన్న కోహ్లీ 310 పరుగులు బాదాడు. తాజాగా ఆ రికార్డును బ్రూక్ దాటేశాడు.