T20, Hardik, Kohli, Gambhir : హార్థిక్ కు తెలుసు.. కోహ్లీకి తెలీదు.. గంభీర్ ఎంపికపై బీసీసీఐ వైఖరి

భారత క్రికెట్ లో కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం మొదలైనట్టే.. ఇటీవలే గంభీర్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ అతన్ని ఎంపిక చేసే క్రమంలో కాస్త ఆశ్చర్యకరంగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది.

 

 

భారత క్రికెట్ లో కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం మొదలైనట్టే.. ఇటీవలే గంభీర్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ అతన్ని ఎంపిక చేసే క్రమంలో కాస్త ఆశ్చర్యకరంగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది. గంభీర్ ను కోచ్ గా నియమించేటప్పుడు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని సంప్రదించలేదని సమాచారం. కనీసం మాట వరుసకైనా కొత్త కోచ్ ఎంపిక నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. అదే సమయంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో మాత్రం బోర్డు వర్గాలు చర్చించనట్టు వార్తలు బయటకు రావడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. గతంలో రెండు సార్లు గంభీర్, కోహ్లీ మైదానంలోనే గొడవపడ్డారు. అయితే ఐపీఎల్ 17వ సీజన్ లో మాత్రం ఒకరినొకరు హగ్ చేసుకొని తమ పాత గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఈ క్రమంలోనే గంభీర్ నియామకానికి ముందు కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ.. ఈ నియామకం విషయంలో విరాట్ కోహ్లీని విస్మరించినట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాల అభిప్రాయాలను మాత్రమే తీసుకుందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. టీ20 ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దూరం కాగా.. హార్దిక్ పాండ్యా సారథిగా కొనసాగనున్నాడు. కోహ్లీ మూడు,నాలుగేళ్ళలో ఆటకు గుడ్ బై చెప్పే అవకాశముండడంతోనే బోర్డు అతన్ని పట్టించుకోలేదని అర్థమవుతోంది.