Sanju Samson: జాతీయ జట్టుకు కానిస్టేబుల్‌ కొడుకు.. హ్యాపీ బర్త్ డే సంజు..

సంజూ తండ్రి శాంసన్‌ ఢిల్లీలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కూడా! తన అన్నయ్య సాలీ శాంసన్‌ జూనియర్‌ క్రికెట్‌లో కేరళ వరకే పరిమితం కాగా.. సంజూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 04:55 PM IST

Sanju Samson: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజూ శాంసన్‌ పుట్టినరోజు శనివారం. కేరళకు చెందిన ఈ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ శనివారం 29వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. కేరళలోని విలింజం అనే చిన్న పట్టణంలో 1994లో జన్మించాడు సంజూ. అతడి తల్లిదండ్రులు లిల్లీ విశ్వనాథ్‌, శాంసన్‌ విశ్వనాథ్‌. సంజూ తండ్రి శాంసన్‌ ఢిల్లీలో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కూడా! తన అన్నయ్య సాలీ శాంసన్‌ జూనియర్‌ క్రికెట్‌లో కేరళ వరకే పరిమితం కాగా.. సంజూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.

TDP-JANASENA ALLIANCE: జగన్‌పై తగ్గేదే లే..! టీడీపీ, జనసేన ఉమ్మడి పోరాటం

ఢిల్లీలోని రోసరీ సీనియర్‌ సెకండరీ స్కూళ్లో చదుకున్న సంజూ.. తిరువనంతపురంలో డిగ్రీ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం కేరళకు ప్రాతినిథ్యం వహించిన సంజూ వికెట్‌ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణించాడు. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ తన ఆటతో దూసుకుపోయాడు. ఈ క్రమంలో 2015లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. అలా జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా సంజూ శాంసన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, వన్డేల్లో అరంగేట్రం కోసం సంజూ ఆరేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంకతో 2021 వన్డే సిరీస్‌ సందర్భంగా సంజూకు తుదిజట్టులో చోటు కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. అయితే, సంజూకు ఇంతవరకు టెస్టుల్లో అడుగుపెట్టే అవకాశం మాత్రం రాలేదు. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి ఎంపికవుతానని ఆశించిన సంజూకు సెలక్టర్లు మొండిచేయే చూపారు.

అయితే, టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సహా మాజీ క్రికెటర్‌ రవి శాస్త్రి వంటి వాళ్లు సంజూకు అండగా నిలబడ్డారు. ప్రతిభావంతుడైన సంజూకు మరిన్ని అవకాశాలు కల్పించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. బ్యాటర్‌గా రాణిస్తూ కెప్టెన్‌గానూ ప్రతిభను నిరూపించుకున్న ఈ కేరళ ఆటగాడు ఐపీఎల్‌-2022లో రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. అయితే, తాజా సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. ఇక క్రికెటర్‌గా కొనసాగుతున్న సంజూ పలు బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న సంజూ శాంసన్‌ నికర ఆస్తి విలువ దాదాపు రూ.75 ​కోట్లని అంచనా.