IPL : 10 బంతుల్లోనే 50 కొట్టాడు…

ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌లో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటర్ విల్ జాక్స్ గుజరాత్ బౌలర్ల (Gujarat Bowlers) పై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు.

ఐపీఎల్‌ (IPL) 17వ సీజన్‌లో బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బ్యాటర్ విల్ జాక్స్ గుజరాత్ బౌలర్ల (Gujarat Bowlers) పై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి ధాటికి గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ బాదాడు.

సెంచరీలో చివరి 50 పరుగులు సాధించడానికి కేవలం పది బంతులే తీసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా విల్ జాక్స్ చరిత్ర సృష్టించాడు.
అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (Chris Gayle) పేరిట ఉంది. హాఫె సెంచరీని సెంచరీగా మలచడానికి గేల్ 13 బంతులు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్స్ అయిదో స్థానంలో నిలిచాడు.

ఈ జాబితాలో క్రిస్ గేల్ టాప్‌లో ఉన్నాడు. గేల్ కేవలం 30 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. గేల్ తర్వాతి స్థానాల్లో యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్, ట్రావిస్ హెడ్ , జాక్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే విల్ జాక్స్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. 201 పరుగుల టార్గెట్‌ను ఆర్‌సిబి కేవలం 16 ఓవర్లలో ఫినిష్ చేసింది.