Sanju Samson: సంజూ యాంటీస్ ఫుల్ ఖుషీ.. రీజన్ ఇదే..!

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పేలవ ఫాంతో ఆడిన సంజూ శాంసన్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. అయితే తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులు మాత్రమే చేసిన సంజూ.. టీ20 ఫార్మాట్‌లో 6000 పరుగులు పూర్తి చేసిన రికార్డును లిఖించాడు.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 04:04 PM IST

Sanju Samson: వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో వైఫల్యం జట్టు ఓటమికి కారణమైంది. మరీ ముఖ్యంగా భారత జట్టు టాప్ ఆర్డర్ పెవిలియన్ పరేడ్ టీమ్ ఇండియాను కష్టాల్లో పడేసింది.

ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పేలవ ఫాంతో ఆడిన సంజూ శాంసన్.. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. అయితే తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులు మాత్రమే చేసిన సంజూ.. టీ20 ఫార్మాట్‌లో 6000 పరుగులు పూర్తి చేసిన రికార్డును లిఖించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి సంజుకు సిరీస్ ప్రారంభానికి ముందు కేవలం 21 పరుగులు మాత్రమే అవసరం. తొలి రెండు మ్యాచ్‌ల్లో 12, 7 పరుగులు చేసిన సంజూ 5వ టీ20లో 13 పరుగులు చేసి టీ20 క్రికెట్‌లో 6000 పరుగులు పూర్తి చేసిన వారి జాబితాలో చేరాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 13వ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో 14,562 టీ20 పరుగులతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

బ్యాటింగ్ ప్యాట్రన్‌లో 6000కు పైగా పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 11,965 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 11,035 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం తెలీని సంజూని వరల్డ్ కప్ స్కాడ్ లో కంటిన్యూ చేయడం కష్టమేనని ఫ్యాన్స్ ఆందోళనచెందగా, తిలక్ రూపంలో ఒక నమ్మదగిన బ్యాటర్ టీమిండియాకు దొరికాడు. దీంతో ఇండియన్ క్రికెట్ లవర్స్ ఒకింత గర్వంగా ఫీలవుతున్నారు.