TANMAY AGARWAL : ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో హైదరాబాదీ క్రికెటర్ రికార్డుల మోత

రంజీ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పలువురు బ్యాటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాడు తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరుగుతు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

 

 

 

రంజీ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పలువురు బ్యాటర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రంజీ జట్టు ఆటగాడు తన్మయ్ అగర్వాల్ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరుగుతు మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తన్మయ్ టీ ట్వంటీ తరహాలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 160 బంతుల్లోనే 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ రాహుల్‌సింగ్‌తో కలిసి రికార్డు స్థాయిలో 449 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

147 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన తన్మయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్‌ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్‌ నెలకొల్పిన రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ జాబితాలో కెన్‌ రూథర్‌ఫర్డ్‌ , వివ్‌ రిచర్డ్స్‌ కుశాల్‌ పెరీరా కూడా ఉన్నారు. ఇదే క్రమంలో తన్మయ్‌ భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల క్రితం రవిశాస్త్రి నమోదు చేసిన రికార్డును తిరగరాశాడు. అలాగే రంజీ ట్రోఫీ ఒక ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన్మయ్‌ బ్రేక్ చేశాడు.

తన్మయ్ అగర్వాల్ జోరుకు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. పసలేని వారి బౌలింగ్‌ను ఆటాడుకున్న తన్మయ్‌ ఏ దశలోనూ సింగిల్స్‌కు పెద్దగా ప్రయత్నించకుండా భారీ షాట్లే ఆడాడు. ఫలితంగా ఆటముగిసే సమయానికి 529 పరుగుల భారీస్కోరు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఒక్కరోజే 700కు పైగా పరుగుల స్కోరు నమోదవడం కూడా రికార్డే. రంజీ మ్యాచ్‌లో అది కూడా 87.4 ఓవర్లలోనే 701 రన్స్ చేయడం సరికొత్త రికార్డుగా నిలిచింది.