Kohli-Anushka Sharma : నేను తప్పు చేశా..అది నిజం కాదు.. కోహ్లీ విషయంలో ఏబీడీ యూటర్న్‌

స్టార్ క్రికెటర్ (Star Cricketer) విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB Devillians) వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పుచేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ (England) తో తొలి రెండు టెస్టులకు కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు.

స్టార్ క్రికెటర్ (Star Cricketer) విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి చెప్పిన వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (AB Devillians) వెనక్కి తీసుకున్నాడు. ఘోరమైన తప్పుచేశానని, తాను చెప్పిన విషయాల్లో వాస్తవం లేదని డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ (England) తో తొలి రెండు టెస్టులకు కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే కోహ్లి అందుబాటులో ఉండకపోవడానికి గల స్పష్టమైన కారణాలు ఎవరికీ తెలియదు. ఈ విషయంలో డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ కోహ్లి- అనుష్క శర్మ (Kohli-Anushka Sharma) రెండోసారి పేరేంట్స్ కాబోతున్నారని చెప్పాడు. కోహ్లికి అత్యంత సన్నిహితుడైన డివిలియర్స్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పడంతో అది నిజమేనని, అందుకే కోహ్లి జట్టుకు దూరమయ్యాడని అందరూ భావించారు.

కానీ తాజాగా డివిలియర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను ఘోరమైన తప్పు చేశాననీ, అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశానని వ్యాఖ్యానించాడు. తాను చెప్పిన విషయం నిజం కాదనీ, విరాట్ కోహ్లి కుటుంబంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నాడు. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఆటకు విరామం తీసుకోవడానికి కారణం ఏమైనప్పటికీ.. మరింత బలంగా, మెరుగ్గా, తాజాగా రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నట్టు డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లి ఇంగ్లండ్‌తో మూడు, నాలుగు టెస్టులకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేగాక చివరి టెస్టులోనూ అతడు అందుబాటులో ఉండటం అనుమానమే అని సమాచారం. ఆడతాడా లేదా అనే అంశంపై కోహ్లి తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి.అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి.