Rohit Sharma: రోహిత్ దెబ్బకు ర్యాంకులు చెల్లాచెదురు.. ఐసీసీ ర్యాంకులపై ఓ లుక్కేయండి..!

అటు బ్యాటింగ్‌, ఇటు కెప్టెన్సీలోనూ దుసుకుపోతున్న రోహిత్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ని రిలీజ్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 07:48 PM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో చెలరేగి బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని బీట్ చేశాడు. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడితే అందులో రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విశ్వరూపం చూపించాడు. కొడితే సిక్స్‌ లేకపోతే ఫోర్‌ అన్నట్టు సాగుతున్న రోహిత్ ఆటను ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు. రోహిత్ ఇదే ఊపును కొనసాగిస్తే వరల్డ్‌కప్‌లో ఇండియాకు బ్యాటింగ్‌లో తిరుగే ఉండదు.

అటు బ్యాటింగ్‌, ఇటు కెప్టెన్సీలోనూ దుసుకుపోతున్న రోహిత్ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ టెన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ని రిలీజ్ చేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ఐదు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ మూడు మ్యాచ్‌ల్లో 217 రన్స్ చేశాడు. ఏకంగా 141 స్ట్రైక్‌రేట్‌తో ఈ రన్స్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఈ రేంజ్‌ స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు కొద్ది మందే ఉంటారు. అలాంటిది రోహిత్ శర్మ వన్డేల్లో ఈ రేంజ్‌లో అదరగొడుతున్నాడంటే అతను ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా రన్ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ నంబర్‌ 8 ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అటు ఇండియాపై హాఫ్‌ సెంచరీ చేసిన పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ ఖాతాలో 18 పాయింట్లు పడ్డాయి. అతను టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా.. టీమిండియా యువ సంచలనం శుభమన్‌ గిల్‌ నంబర్‌ 2 ర్యాంక్‌లో ఉన్నాడు. ఇటివలే గిల్‌ డెంగీ బారిన పడ్డాడు. తర్వగానే కోలుకున్న గిల్‌ పాకిస్థాన్‌పై మ్యాచ్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో వరుస బౌండరీలతో టచ్‌లో కనిపించిన గిల్‌ 16 పరుగులకు ఔట్ అయ్యాడు. అటు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్న యార్కర్‌ కింగ్‌ బుమ్రా ఏడు స్థానాలను మెరుగుపరుచుకోని 14వ ర్యాంక్‌కు వచ్చాడు. ఇక టాప్‌-10 బౌలర్లలో భారత్‌ నుంచి హైదరాబాదీ స్పీడ్‌ స్టార్‌ సిరాజ్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు. సిరాజ్‌ మూడో స్థానంలో ఉండగా.. కుల్దీప్‌ 8వ ర్యాంక్‌లో కంటిన్యూ అవుతున్నాడు.