U-19 World Cup: భళా యువ భారత్.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో యంగ్ ఇండియా

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టోర్నీ మొదట నుంచీ అదరగొడుతున్న టాపార్డర్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు.

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 07:17 PM IST

U-19 World Cup: అండర్ 19 ప్రపంచకప్ 2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయం సాధించి ఈ టోర్నీ చరిత్రలోనే 9వసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో ఉత్కంఠగా సాగిన తొలి సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది.

Rishabh Pant: పంత్ ఐపీఎల్ ఆడతాడు కానీ.. ఢిల్లీ కోచ్ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు

లక్ష్య చేధనలో భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. టోర్నీ మొదట నుంచీ అదరగొడుతున్న టాపార్డర్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు. దీంతో భారత్ కేవలం 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సచిన్ ధాస్‌తో కెప్టెన్ ఉదయ్ శరణ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పార్టనర్ షిప్ మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఉదయ్ శరణ్ ఆచితూచి ఆడగా… సచిన్ దాస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వరుస బౌండరీలతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో వీరిద్దరూ ఔట్ అయినా.. మిగిలిన బ్యాటర్లు జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

భారత యువ జట్టు 48.5 ఓవర్లలో 8 వికెట్లకు 248 పరుగులు చేసి గెలుపొందింది. అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ వరుసగా అయిదో సారి ఫైనల్లో అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ నిలుపుకోవాలని ఎదురు చూస్తున్న భారత్ టైటిల్ కోసం ఆస్ట్రేలియా , పాకిస్థాన్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడుతుంది.