ICC WORLD CUP 2023: ఇండియాతో సెమీస్ ఆడే జట్టు ఏది..? ఈ రెండింట్లో ఛాన్స్ ఎవరికి..?

న్యూజిలాండ్ 8 మ్యాచ్‌లలో 8 పాయింట్లను కలిగి ఉంది. అంటే కివీస్ జట్టుకు కేవలం 1 లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. శ్రీలంకపై కివీ జట్టు ఓడిపోతే 8 పాయింట్లు మిగులుతాయి. న్యూజిలాండ్‌తో పాటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లు కూడా 8 పాయింట్లతో ఉన్నాయి.

  • Written By:
  • Updated On - November 8, 2023 / 05:10 PM IST

ICC WORLD CUP 2023: గురువారం న్యూజిలాండ్‌తో శ్రీలంక కీలక మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ 8 మ్యాచ్‌లలో 8 పాయింట్లను కలిగి ఉంది. అంటే కివీస్ జట్టుకు కేవలం 1 లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. శ్రీలంకపై కివీ జట్టు ఓడిపోతే 8 పాయింట్లు మిగులుతాయి. న్యూజిలాండ్‌తో పాటు పాకిస్థాన్‌ (Pakistan), ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లు కూడా 8 పాయింట్లతో ఉన్నాయి.

Glenn Maxwell: మ్యాక్సీ.. నువ్‌ మనిషివేనా.. ఆఫ్గన్‌పై రికార్డ్ డబుల్ సెంచరీ..!

అయితే, ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఆఫ్గానిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో ఓడిపోవడం వల్ల సౌతాఫ్రికా మ్యాచ్ కీలకం కానుంది. ఒకవేళ ఆసీస్ మీద ఆఫ్గన్ విజయం సాధించి ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లకు గట్టి షాక్ తగిలేది. కానీ, ఆఫ్గాన్ జట్టు ఓడిపోవడంతో పాక్, న్యూజిలాండ్ జట్లకు కాస్త రిలీఫ్ దొరికింది. ఇప్పటివరకు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌ (Semi Finals)కు అర్హత సాధించాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 8 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, న్యూజిలాండ్‌తో పాటు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా, న్యూజిలాండ్, పాక్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, ఖాతాలో 8 పాయింట్లు చేర్చుకుంది. దీంతో లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ టీంతో తలపడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌కు ఛాన్స్ ఉంటుంది.