ICC WTC Points: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. రాజ్‌కోట్‌ విజయంతో రెండో ప్లేస్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.

  • Written By:
  • Publish Date - February 19, 2024 / 03:43 PM IST

ICC WTC Points: రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండ్ షో కనబరిచిన రోహిత్ సేన నాలుగో రోజే ఇంగ్లాండ్ కథ ముగించింది. ఈ భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, రెండు ఓటమి, ఒక డ్రాతో 59.52 పాయింట్ల శాతంతో సెకెండ్ ప్లేస్‌లో నిలిచింది.

Yashasvi Jaiswal: డబుల్ సెంచరీ చేసినా.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కని జైస్వాల్

టీమిండియా తన WTC సైకిల్‌ను గత ఏడాది జులైలో వెస్టిండీస్‌లో 1-0 సిరీస్ విజయంతో ప్రారంభించింది. కొత్త ఏడాదిలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను సమం చేయడానికి ముందు మొదటి టెస్ట్‌లో ఓడిపోయింది. అలాగే, దక్షిణాఫ్రికాలోనూ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో డబ్యూటీసీలో భారీగా దిగజారిపోయింది. అయితే మళ్లీ పుంజుకుని విశాఖపట్నం, రాజ్‌కోట్‌లలో వరుస విజయాలు నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలవడం ద్వారా WTC పాయింట్ల పట్టికలో మళ్లీ తన ప్లేస్‌ను మెరుగు పరుచుకుంది.

మరోవైపు ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలతో ఇంగ్లండ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. WTC పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండో ప్లేస్‌లో నిలిచిన ఇంగ్లాండ్‌కు స్లో ఓవర్ రేట్ కూడా భారీగా దెబ్బ కొట్టింది.