RCB: ఈ బౌలింగ్‌తో టైటిల్ గెలుస్తారా.. ఆర్‌సీబీపై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ సెటైర్

బెంగ‌ళూరు పేల‌వ‌మైన బౌలింగ్ కార‌ణంగా మ‌రో పంతొమ్మిది బాల్స్ మిగిలుండ‌గానే కోల్‌క‌తా ఈ టార్గెట్‌ను ఛేదించింది. సిరాజ్‌తో పాటు బెంగ‌ళూరు బౌల‌ర్లు అంద‌రూ ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయ‌లేక‌పోయారు.

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 06:58 PM IST

RCB: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో పరాజయాన్ని చవిచూసింది. హోంగ్రౌండ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్‌లో కోహ్లీ తప్పిస్తే ఎవరూ రాణించలేదు. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. ఆర్‌సీబీ బౌలర్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బెంగ‌ళూరు పేల‌వ‌మైన బౌలింగ్ కార‌ణంగా మ‌రో పంతొమ్మిది బాల్స్ మిగిలుండ‌గానే కోల్‌క‌తా ఈ టార్గెట్‌ను ఛేదించింది.

Nithiin: నితిన్ సినిమాకు పవన్ టైటిల్.. పాజిటివ్ బజ్ ఖాయమా..?

సిరాజ్‌తో పాటు బెంగ‌ళూరు బౌల‌ర్లు అంద‌రూ ధారాళంగా ప‌రుగులు ఇచ్చారు. ఒక్కరంటే ఒక్కరూ కూడా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయ‌లేక‌పోయారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు బెంగళూరు బౌలర్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ ఆర్‌సీబీపై సంచలన ట్వీట్ చేశాడు. ఈ బౌలింగ్ ఎటాక్‌తో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌డం అసాధ్యమ‌ని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. అత‌డి కామెంట్స్‌తో ప‌లువురు క్రికెట్ అభిమానులు ఏకీభ‌విస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌తో క‌నీసం ప్లేఆఫ్స్ కూడా దాటడం క‌ష్టమే అంటూ మైఖేల్ వాన్ ట్వీట్‌కు రిప్లే ఇస్తున్నారు. ఐపీఎల్‌లో బౌలింగ్ ప‌రంగా పూర్‌గా ఉన్న జ‌ట్టు ఆర్‌సీబీనేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వేలంలో ఆర్‌సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదంటూ విమర్శిస్తున్నారు.

అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంటే తప్ప ఆర్‌సీబీ టైటిల్ గెలవడం అసాధ్యమంటూ తేల్చేస్తున్నారు. మ‌రో మాజీ క్రికెట‌ర్ టామ్ మూడీ కూడా ఆర్‌సీబీ బౌలింగ్ లైన‌ప్ బాగాలేదంటూ కామెంట్స్ చేశాడు. ఇద్దరు ఓవ‌ర్‌సీస్ పేస‌ర్ల‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంటే ఆర్‌సీబీ మెరుగైన ఫ‌లితాలు సాధించే అవ‌కాశం ఉంద‌న్నాడు. గత సీజన్‌లో రాణించిన సిరాజ్‌ మూడు మ్యాచ్‌లు అయినా ఇంకా గాడిన పడకపోవడంపైనా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.