Team India: నంబర్ 4 నాదంటే నాది

ఏ జట్టుకైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్ధానం చాలా కీలకం. టాపర్డర్‌ కుప్పకూలినప్పుడు జట్టును అదుకోవాల్సిన బాధ్యత నాలుగో స్ధానంలో వచ్చే ఆటగాడిది.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 06:35 PM IST

ఏ జట్టుకైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్ధానం చాలా కీలకం. టాపర్డర్‌ కుప్పకూలినప్పుడు జట్టును అదుకోవాల్సిన బాధ్యత నాలుగో స్ధానంలో వచ్చే ఆటగాడిది. అయితే భారత క్రికెట్‌లో మాత్రం నాలుగో స్ధానం అంటే టక్కున గుర్తుచ్చేంది మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌నే. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌ సింగ్‌.. తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పడు.. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌ విజయంలో యువరాజ్‌ పాత్ర మరవలేనది. అయితే యువీ రిటైర్మెంట్‌ తర్వాత ఆ స్ధానానికి తగ్గ ఆటగాడు దొరకలేదు. అప్పటినుంచి భారత్‌కు నెం4 కష్టాలు మొదలయ్యాయి. అయితే కొన్నాళ్లపాటు అంబటి రాయుడు ఆ స్ధానంలో అలరించాడు. రాయుడు విజయవంతం కావడంతో నెం4 కష్టాలు తీరిపోయాయని అంతా భావించారు.

కానీ 2019కు ప్రపంచకప్‌కు ముందు రాయుడు అనుహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడంతో మళ్లీ భారత్‌కు నెం4 కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత చాలా మందిని ఆ స్ధానంలో భారత జట్టు మెన్‌మెజ్‌మెంట్‌ ట్రై చేసింది. అందులో అజింక్యా రహానే, దినేష్‌ కార్తీక్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు కూడా ఉన్నారు. కొన్నాళ్లు పాటు ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన భారత్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో పరిష్కారం దొరికింది. మిగితా వారితో పొలిస్తే అయ్యర్‌ ఆ స్ధానంలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయితే ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్లు ముందు అయ్యర్‌ గాయపడడంతో మళ్లీ నెం4 కష్టాలు మొదలయ్యాయి.

వన్డేల్లో అతడి స్ధానాన్ని టీ20 నెం1 బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో జట్టు మెనెజ్‌మెంట్‌ ప్రయత్నించింది. కానీ భారత్‌కు నిరాశే ఎదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయ్యి సూర్య తీవ్ర నిరాశపరిచాడు. అయితే మరో అప్షన్‌ లేకపోవడంతో ప్రస్తుతం సూర్యకుమార్‌నే భారత్‌ కొనసాగిస్తోంది. సూర్య తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవతున్నాడు. దీంతో అతడు ఆ స్ధానానికి సరిపోడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భారత సెలక్షన్‌ కమిటీకి ప్రస్తుతం ఐదు ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో అయ్యర్‌, రాహుల్‌ వంటి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా సెలక్టర్లను అందోళనకు గురిచేస్తోంది. కానీ యువ సంచలనం తిలక్‌ వర్మరూపంలో మరో ఎంపిక కూడా సెలక్టర్లకు దొరికింది. ఆసియా కప్ లో ఎవరు నిరూపించుకుంటే వాళ్లే నంబర్ 4 స్థానంలో వరల్డ్ కప్ జెర్సీని తొడగనున్నారు.