2023 World Cup : సర్ జడేజా ..‘మొదటి నుంచి కూడా నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా.

వన్డే ప్రపంచకప్‌ (World Cup) 2011లో మాజీ ఆల్‌రౌండర్‌ (ODI World Cup 2011) యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నిర్వర్తిస్తున్నాడు.

వన్డే ప్రపంచకప్‌ (World Cup) 2011లో మాజీ ఆల్‌రౌండర్‌ (ODI World Cup 2011) యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) నిర్వర్తిస్తున్నాడు. జట్టుకు అవసరం అయినపుడు రన్స్ చేస్తూ, వికెట్స్ తీస్తూ సరైన ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫీల్డింగ్‌ విన్యాసాలతో పరుగులను అడ్డుకోవడమే కాకుండా.. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ బ్యాటర్‌లను పెవిలియన్ చేర్చుతున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

SRILANKA CRICKET BOARD : ఒక్క ఓటమితో శ్రీలంక బోర్డు రద్దు..

ఇప్పటివరకు ప్రపంచకప్‌లో 110 పరుగులు, 14 వికెట్లు తీశాడు. మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రవీంద్ర జడేజా మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘మొదటి నుంచి కూడా నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. జట్టులో ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటనేది తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు పరుగులు చేయడం, వికెట్ తీయడం నా బాధ్యత. మ్యాచ్‌లో నా ప్రభావం చూపించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. ఫీల్డింగ్‌లో నేనే గొప్ప అని మాత్రం భావించను. నేడు క్యాచ్‌లను మిస్‌ చేశా. అయితే ఎప్పుడూ సాధన చేస్తూనే ఉంటా. ఓ క్యాచ్‌ పట్టగానే రిలాక్స్‌ కాను. ఇంకా మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తా. కొన్నిసార్లు క్యాచ్‌లను అందుకోలేకపోవచ్చు. అయితే ప్రయత్నించడం మాత్రం ఆపను’ అని జడేజా తెలిపాడు.