కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు అనంతరం మైదానాన్ని వీడే క్రమంలో బాబర్ స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్, నెటిజన్లు.. బాబర్ ‘స్పోర్ట్స్ బ్రా’ వేసుకోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండవ టెస్టులో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానాన్ని వీడుతుండగా.. ఫాన్స్ జెర్సీ ఇవ్వమని కోరాడు. దాంతో అభిమానికి ఇవ్వడానికి తన జెర్సీని అక్కడే తీసేశాడు.
దాంతో పాక్ కెప్టెన్ వేసుకున్న స్పోర్ట్స్ బ్రా చూసి ఫాన్స్, సెక్యూరిటీ షాక్ అయ్యారు. అయితే బాబర్ వేసుకుంది స్పోర్ట్స్ బ్రాలా కనిపించే ‘వెస్ట్’. సామాన్యులకు ఇది గందరగోళంగా ఉన్నప్పటికీ.. ఇది అథ్లెట్లకు మాములే అని క్రీడా పండితులు చెప్తున్నారు. బాబర్ ఆజామ్ వేసుకున్న దాన్ని ‘కంప్రెషన్ వెస్ట్’ అంటారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు సాయపడుతుంది. ఈ వెస్ట్ చాలా తేలికగా ఉంటుంది. ఎంతలా అంటే.. వేసుకున్నట్లు కూడా ఉండదు.
ఇందులో జీపీఎస్ ట్రాకర్ ఉంటుంది. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉంటాయి. ఇది ఆటగాడి కదలికలను 3డి లో కొలుస్తూ.. అన్నింటిని ట్రాక్ చేస్తుంది. ఆటగాడి రన్నింగ్ స్పీడ్, హార్ట్ రేట్, శారీరిక శక్తిని మానిటర్ చేస్తుంది. ట్రైనర్ లేదా టీమ్ డేటా సైంటిస్టులకు అవసరమైన అన్ని నంబర్‌లను కంప్రెషన్ వెస్ట్ అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్లేయర్ ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తారు. దీనిని టీమిండియా ఆటగాళ్లు కూడా ఉపయోగిస్తుంటారు.